పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రలు,వలసినన్ని యధోచితమైనవెలకు దొరకును,ప్రతిగొప్పస్థలములోను పాటపాట తెలుగువచ్చిన బ్రాహ్మనులు,వర్తకులునుగలరు.ఇక్కడితో దగింపురైలుసరి.ఇక్కడినుండిరోడ్డు మీదుగాబండ్లుచేసుకునిగాని, నడచిగాని యనంతశయన మైదుదినములకు జేరుదురు. కొండత్రోవ ఇప్పుడు యండలు మెండుగావున్నందున, త్రోవలో బావులలోసైతము నీరు దొరకక మిగుల శ్రమయగుననియు, ప్రక్రుతమందు రక్తభేదులు నోటిపూత పుట్టుననియు బహుజనులు చెప్పినందున తిరువనంతపురమునకు బయలుదేరలేదు. అనంతశయనమునుండి సముద్రపుద్రోవగుండా --దినములుపోగా అచ్చట ఖరాసురప్రతిస్థితములైన 3 లింగములు గల 3 దివ్యస్థలములు. గొప్పమహిమ నేటికిని కనపరుచుచున్నవని ఇక్కడివారుచెప్పినారు. రెండుచేతులతోను రెండులింగములు నోటితో నొకలింగము ఏకముహూర్తమందు ఖరాసురుడు ప్రతిస్థించెనట. అందులో కుడిచేతితో ప్రతిషించెనస్థలము వెక్కెము. ఎడమచేతితోప్రతిష్టించినస్తలము ఏత్వనూరు నోటితో ప్రతిస్టించినస్తలము కడిత్తురి అనిచెప్పుదురు. వాటిమహిమలు ముందుచూచినపైని వ్రాయుచున్నాము. ఈ --వెల్లిస్టేషనుదరినున్న యూరికుత్తరముగా సుమారు--మయిల్లదూరములో తిరునల్వేలియని యొక--పాలెంకోటవంటిబస్తీపట్టణముగలదు. రమ్యముగానేవున్నది. స్త్రీపురుషులు మధురలోకన్నా కొంతమెరుగుగానుందురు. ఇక్కడనల్లెపారే తిరునల్వేలీస్వర్ శ్రీ వేనువనేస్వుడు అని మూడు పేలుగల స్వయంవ్యక్త శివునిస్థలము--4 గోపురములు --ప్రాకారములు పెక్కు మండపములుగలిగి-- బహువిశదముగానున్నది. ఆచెంతణె శ్రీకాంతిమతీదేవియొక్క మందిరము సుందరముగానున్నది. ఈరెండును మధురమందిరమువలే కలసియున్నవి. అమ్మవారిగుడికి మూడుప్రాకారంబులున్నవి. అందు--ప్రాకారములోపుష్పవనములోనున్న వన