పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమైన తనచేతితో వాడు తెచ్చిన, యస్థికలను స్వకీయముగాపిల్చి స్వీకరించి, నేటినుండీయూ నెవ్వరస్థికలనీ తామ్రపర్ణిలో వైతురో, వారిపిత్రుదేవతలును, వారును, శాశ్వతపదవి నొందుదురనియు, నేనిందు సన్నిహితురాలనైయుందుననియు గంగ, యానతిచ్చెనట. కావుననే, నేటివరకదేతీరున నస్థికలవైచుచు హిరణ్యాది శ్రార్ధంబులను జేయుచుంట, సదాచారమై యున్నదనియు, స్థలపురాణములో నిట్లున్నదనియు నిక్కడి పెద్దలనిరి, దీని యుత్తరతీరమునందా నందవల్లీదేవీసహిత కైలాసనాథేశ్వరమందిర మొక గోపురముతో, నొకప్రాకారముతో సాధారణముగానున్నది. యిది బహుపురాతనమని చెప్పుదురు, గొప్ప తేరొకటియున్నది, తగుమాత్రపు వాహనములున్నవి. అప్పుడప్పుడుత్సవములు జరుగుచుండును, ఏటికి దక్షిణ, నైరుతిగా, పాలెంకోటయని, యొక జిల్లా స్థలమున్నది. ఖచేరీలన్నియుంగలవు, పట్టణ మొకతరబడీగా, గొప్పదిగానున్నది, అన్ని యంగళ్లు గలవు, ప్రతి ఇల్లు, ప్రతి మిద్దె, ప్రతి మహడీ, సమీపశ్రేణిగాయున్నప్పటికీ నొకదానినొకటియంటియుండక ప్రత్యేకావరణములు గలిగి వీధులలో టెంకాయ వగైరా చెట్లలోవున్నందున, సుందరముగానే కనబడూచున్నది, స్త్రీ పురుషులు, మధురలోవలే నుందురు, గానీ స్త్రీలకు మధురలోవలే వికారపు చెవికుట్టురంధ్రములు లేక యధోచితముగానున్నందునను, తగుమాత్రపు భూషణములున్నందునను, ఇంచుకంత చూడతగియుందురు. కంచిమొదలుకొని యిదివరకు చూచిన యావద్దేశములోను స్త్రీలుగాని పురుషులుగాని, ఆబాలగోపాలముగా, స్నానము భస్మదారణము, దైవభక్తి, తాంబూలము, లేనివారు లేనేలేరు, తఱచుగా స్త్రీలును, వితరంబుగా పురుషులునూ, రంగుబట్టలు కట్టుదురు, ఈప్రాంతములయందు అరటితోటలు, టెంకాయ తోటలు, వగైరాలు బహుసాంద్రముగానున్నందున టెంకాయలు, అరటిపండ్లు, అరటికాయలు కొన్ని కొన్ని కూరలు, వలసినన్ని, య