పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నది. ఇటీవల కొంతకాలంబుక్రిందట నొకచోటద్రవ్వుచుండగా బంచలోహమయమైన శ్రీ సీతా విగ్రహము దొరికినందున దానినీజగన్నాధాలయములో శ్రీ రాములవారి పాశ్వన్మందు నూతనంబుగా బ్రతిస్టించిరని విన్నారము. తిలకేశ్వరుడని యొక శివలింగమున్నగుడి సత్రంబునకెదురుగా వున్నది. అదియు సేవింతురు--గనక మేమునట్లనే యీయాత్రజరిగింది. భోజనానంతరమే బయలుదేరి రామనాధపురపు దరినున్న లక్ష్మనపురపు సత్రంబునకారాత్రికే జేరివెంటనే బయలుదేరి దినక్రమంబుగా పరమగుడి ఉచ్చపులి ముత్తనందల్ వీనిమీదుగా మార్చి30 వ తేదీ ఉదయంబునకు మరలా మధురలో బ్రవేసించినారము. దశపాషానంబులు ధర్బ శయనంబు, యెత్తెలమండపంబు యీ స్థలములోపల నారామడవలయముగా గల ప్రదేశమును పుల్లారన్యమందురు. ఇచటిసంకల్పంబులో పుల్లారణ్యేయనియుం జెప్పుదురు.

ఏప్రిల్ --వ తేదీ రయల్ మీదుగా తామ్రపణీ తీరమందున్న తిరునల్వేలిలో లోకల్ఫండు యిలాకా సత్రపుమాడిలో ప్రవేసించినారము., ఇది రయలాఫీసు దరినున్నది. గనుక అన్ని పదార్ధములుగల మంచియంగల్లున్నవి ఇక్కడికి దక్షిన భాగమందు సమీపంబులో, తామ్రపణిన్ మహానది, ప్రాగ్వాహినిగావున్నది. ఆ నదిలో ---మండపములు,---చప్టాలున్నవి. పూర్వకాలమందొక దూరదేశభక్తుడు తన తలిదంద్రుల యస్తికలు, కాశీగంగలో వైచుటకుగా బయలుదేరి, దేహాశక్తతయూ, ద్రవ్యాసక్తతయూ గలిగి, పోజాలక చాల కించపడుచుండగా గంగ ప్రసన్నురాలై, ఓభక్తుడా నీవీతామ్రపనీన్నదీతీరమందే నిల్వుము నేనువచ్చి, నీతెచ్చిన యస్తికలను స్వీకరింతునని స్వప్నమందు చెప్పగా, వాడట్లనేనిల్చి, నిరీక్షింపుచుండగా గంగ తామ్రపర్నిలో మిలితముగావచ్చి, యీ భక్తుడున్నచోట, ప్రవాహమద్యమునుండీ కంకణముద్రికాలంకృ