పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రాత్రి బయలుదేరి 26వ తేదీ శు|| నాడుదయంబునకు దర్బశనము చేరి రామనాధపురపు రాజావారి సత్రములో బసచేసి- చక్రతీర్థ రామతీర్థములయందు స్నానంబుజేసి నిస్తరంగఘోషమై 3 మైళ్లదూరమందున్న రత్నాకరమందు స్నానదానాదికంబు లొనరించి- వెంటనేవచ్చి దేవళంబులో వేంచేసియున్న క్షేత్రపాలకుడైన శ్రీజగన్నాధస్వామిని లక్ష్మిని దర్భశాయియై నాభికమలమందు బ్రహ్మగల శ్రీరామమూర్తిని హనుమల్లక్ష్మణ సహిత శ్రీరామోత్సవ విగ్రహములను సేవించుకొని బసకు వచ్చి భుజించి- శంఖాదిపదార్ధములనుకొని సంగ్రహించి- 2 ఘంటలకు బయలుదేరి- రాత్రికి రామనాధపురపు దరినున్న లక్ష్మీపురపు సత్రములో బసచేసినారము.

26వ తేదీ రాత్రి బయలుదేరి 27వ తేదీ శ|| నాటి ప్రాతఃకాలమందు నవపాషాణంబుల దీరి నున్నయొక గ్రామంబులోనున్న రామనాధపురపు రాజావారి సత్రంబులోదిగి- అక్కడికరమైలుకులోగానున్న సముద్రతీరమందలి మంటపంబుచేరి చక్రతీర్థస్నాన పూర్వకంబుగా సంకల్పంబుజెప్పి- సేతువు వద్దవలెనే ధనుఃపూజచేసి ప్రార్ధించి సాధారణపు చర్వువలే నిస్తరంగమై క్రమనిమ్నమైన సముద్రములో మునుపటివలె స్నానము చేసుకొని సముద్రములో మూరెడు నీరున్నచోట శ్రీరాములవారు సేతబంధనారంభ మందిసుకతో స్థాపించి పూజించిన నవగ్రహసంజ్ఞగల నవ పాషాణములను పూజించి గోధూమాది నవధాన్యములు గ్రహపీడాద్యనర్ధ పరిహారార్ధమై నవగ్రహప్రీతిగా యథాశక్తి దక్షిణములతో దానములుచేసి ప్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి తర్వాత హిరణ్యశ్రాంధాదికములు జరిగించి యిచ్చటనేయున్న గణపతి హనుమంతులను దర్శించి యచ్చటికి పడమరగా సమీపమందున్న శ్రీ జగన్నాధస్వామిని లక్ష్మణ హనుమత్సహితులైన శ్రీరాములవారిని సేవించుట విధియై