పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీజగదీశ్వరాయనమోనమః

శ్రీరస్తుశ్రీః

యాత్రా చరిత్ర ఉత్తరభాగము.

1887 సం|| డిశంబరు తే 13 దికి సరియైన సర్వజిత్సం|| మార్గశీర్ష బ. 14 మంగళవారమునాటి సుముహూర్తమందు శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామివారి యనుమతిం బ్రార్థించి బయలుదేరి తే 20 ది వరకు విశాఖపట్టణములో వాల్తేరులో స్వకీయమైన బంగళాలో నివసించి చు1500-0-0 కు కంట్రాక్టు చేసిన కోహినమారనెడు ష్టీమరు గుండా సపరివారముగా తే 22 ది ప్రభాతకాలమునకు శ్రీమచ్చెన్నపురీలలామంబున మౌంటురోడ్డులో రౌన్ ఠాణాదరినున్న శ్రీ వేంకటగిరి మహారాజావారి మోతీమహలులో బ్రవేశించితిమి. సముద్రప్రభావము చూచి సంతసించవలెగాని వ్రాయదరముగాదు. చెన్నపురి స్వరూపము ముద్రిత పుస్తకపటంబుల వలననే తేటతెల్లమగుననియు పూర్వభాగంబున కొంత వ్రాయబడియున్నదనియు మరల నిందువ్రాయమైతిమి ష్టీమరుదిగి బసకు వచ్చువరకు శ్రీ బొబ్బిలి మహారాజావారి కెదురుగా ఘనత వహించిన లార్డు కెనమారగారనెడు మెడ్రాసు గౌర్నరువారు తమ యేడీకామును తమబండితో 5తురుపుసవార్ల సహితముగా బంపిరి. సదరురాజావారు వారిని దర్శించిన పిమ్మట గవర్నరుగారు శ్రీ రాజావారి బసకు విచ్చేసిరి. యీ గౌరవ సత్కారములకు మేమందర