ఈ పుటను అచ్చుదిద్దలేదు
పూర్వభాగము
స్సబాణం నామేశ్రియంపరిదధత్తురగాధిరూఢని పాయాతృమాం
ఖగధరస్థితవేంకటేశ:||
అనునట్లు రేఖాకారంబుగా వేంచేసిన యవసరముగానున్నారు, కొన్ని నృసింహాది సాలగ్రామ శిలలు స్వామివారి సన్నిధిలోనున్నవి. యీ స్వామివారి గుడి చిన్నగుహ వలెనున్నది. యీ గుడియున్న కొందకు306 మెట్లున్నవి. కొండదిగువన స్వామిపుష్కరిణీకి నైఋతి భాగమందు శ్రీవేంకటేశ్వర విగ్రహమొకపాటి మందిరములో బ్రతిష్ఠింపబడి యధోచిత పూజారాగమ్లు గలిగి ప్రకాశింపుచున్నది. దీనికీశాన్యముగా నొక శివాలయము గ్రామమునకుత్తర పాశ్వమందున్నది. బ్రాహ్మణ్లు వైష్ణవులు పెక్కండ్రు గలరు. యీ స్థలము గొడేవారిదై యున్నది. యీ స్వామివారిని యధావిధిగా సేవించి యీరాత్రి బయలుదేరి.30 వ తేది ఆది. 23 మైళ్లదూరమునందున్న యన్నవరపు సత్రమం దు బసచేసితిమి, యీసత్రం కిర్లంపూడి యినుగంటి నృసింహరాయనింగారు కట్టించినారు. శ్లాఘింపతగియున్నది. బ్రాహ్మణుల కాదరించి షడ్రసోపేతంబుగా నన్నంపేట్టుటయేకాదు సోపస్కరంబుగానభ్యంగన స్నానంబు సేయింతురు. వండికొనువారికి సమృద్ధిగా స్వయంపాకంబు లిచ్చుచుందురు. దీనికి బడమరగా నొక గడ్డయున్నది.
ఈదినమిచ్చట నివసించి యీ రాత్రి బయలుదేర్ ఫిబ్రవరి 1వ తేది సో-పీఠికాపురంబు మీదుగా మై.24 చామర్లకోటలో ప్రవేశించితిమి. గడిచిన రాత్ర్రి నడచిన త్రోవలో నడవి గలదు. చోరభీతియుంగలద్దు. యీ పిఠాపురము శ్రీ గంగాధర రామారావు బహదరు గారి రాజధాని. దీనిలో శిధిలమైన మంటికొట గలదు. పట్టణ మొక మైలు వరకు నిడువుగతిగి యున్నది తగియంగళ్లున్నవి. ఉత్తరభాగముందొక సత్రమున్నది. దక్షిణభాగమందున్న పాదగయాక్షేత్రములో నొక