పుట:Womeninthesmrtis026349mbp.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రు 12000 లకు డిక్లరేషన్ ఆఫు ట్రస్టు దస్తావేజు.

ఆ 1931 సం. యేప్రియల్ 9 వ తారీఖున, పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు రిజస్ట్రేషన్ సబుడిస్ట్రక్టు, కొవ్వూరు గ్రామ కాపురస్తులు బ్రాహ్మణులు, హైకోర్టు అడ్వకేటున్ను లేటు వల్లూరి వెంకటకృష్ణయ్యగారి కొమారుడున్ను నగు వల్లూరి సూర్యనారాయణరావు వ్రాసిన డిక్లరేషన్ అవు ట్రస్టు దస్తావేజు.

1. నా చిరకాలపు స్నేహితుడును, నిర్మలస్వార్ధత్యాగముతో చిన్నతనములోనే తన న్యాయవాదవృత్తిని వదలుకొని, సుమారు 15 సంవత్సరములు కష్టించి తన ధనమును, ఆరోగ్యమును తుదకు తనప్రాణములనుకూడ నర్పించి, కోవూరు గ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్తితో "ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ మను" నొక సంస్తాపనను నిర్మించినవాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావుగారు ది 6-3-26 తారీఖున శివసాన్నిధ్యమును చేరినారు. ఆయన నామము ఆచంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నావిధాయక కృత్యమని యెంచి, నాస్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కోఆపరేటివ్ ల్యాండు