పుట:Womeninthesmrtis026349mbp.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని యేడువిధముల పరపూర్వలను పేర్కొనుటలో నారదుడు పైమాటలను చెప్పియున్నాడు.

నారద వసిష్ఠులు దక్క మఱియే స్మృతికారుడును నక్షతయోనికా పునర్వివాహము నంగీకరింపలేదు.

101 వ పుటలో 1 వ పఙ్క్తిలో 'ఇంకను ననేకవిధముల' అనుమాటలు లేనట్లు భావింపవలెను.

109 వ పుటలో 16 వ పఙ్క్తికిని 17 వ పఙ్క్తికిని నడుమ నీక్రింద వాక్యములను చేర్చుకొనవలెను:

షండడగు భర్తను వదలి మఱొకని వివాహమాడ వచ్చునని నారదస్మృతి చెప్పుట పైననీయబడిన నారద. 12-80, 81., 13-28 లకు విరుద్ధముగనున్నది.

      ఈర్షాషండాదయో యేన్యేచత్వారస్స ముదాహృతాః
      త్యక్త వ్యాస్తేపతితవత్ క్షతయోన్యా అపిస్త్రియా
                                   (నారద. 12-15)

(ఈర్ష్యాషండాదులగు నల్గురును గూడ క్షతయోనిచేత గూడ పతితులవలె విడువబడదగిన వారే.)

      అక్షిప్తమోఘ బీజాభ్యాంకృతే పిపతికర్మణి
      పతిరన్యఃస్మృతోనార్యా వత్సరార్థం ప్రతీక్ష్యతు
                                (నారద. 12-16)

(విగతబీజుడును వ్యర్థబీజుడును నగు పురుషునిచేత వివాహమాడబడిన స్త్రీ యొక సంవత్సరము నిరీక్షించి మఱొక భర్తను వివాహమాడవలెను.)