పుట:VrukshaSastramu.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొక పనిముట్టుతో మనము అల్చిప్పతో మాడికాయ దీసినట్లు గీయుదురు. ( ఈ పని ముట్టు నాలుగు కత్తులను మిక్కిలి దగ్గరదగ్గరగాచేర్చి నట్లుండును) ఇట్లు గీసిన చారలలో నొక ద్రవము చేరును. ఈ ద్రవమును నొక పాత్రలోనికి చేర్చి నిలువ చేయుదురు. ఇదియే నల్లమందు.

దీనిలో మరియొక రసము గలిపి గాని కాయల పొప్పర వేసి గాని దగాచేయు చుందురు. కాని మరియొక తైలము గలిపినను నల్లమందు నిలువయుంచగ నుంచగ నన్య పదార్థము పోయి మంచిదే యగును.

గసగసాల పంటయు నల్లమందు వ్యాపారమును చిర కాలమునుండి మన దేశమున జరుగు చుండెను. అప్పటి నుండియు చీనా దేశమున కెగుమతి యెక్కువాగా జేయుచున్నాము. బాబరు మొదలగు మొగలాయి చక్రవర్తుల కాలములో నల్ల మందు మీద పన్నున్నట్లు దెలియు వచ్చుట లేదు. డచ్చి, ప్రెంచి, ఇంగ్లీషు వారలు మన దేశమునకు వర్తకమునకు వచ్చిన తరువాత, మన వర్తకుల వద్ద గొనుక్కొనుచు, ఎగుమతి చేసి కొనుచుండిరి. మన వర్తకులు రైతులకు సొమ్ము పెట్టు బడి పెట్టి తామిచ్చిన సొమ్మునకు బదులుగా నల్లమందును గైకొనుచుండిరి. మిగిలిన నల్లమందులో నేవోకలు