పుట:VrukshaSastramu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రయోజనము లేదని మానమ్మకము. కావున మొదటినుండియు మండలవారిట్టి పత్రికావ్యర్థవాదములలో దిగగూడదని నియమము చేసికొనిరి. కావున మా చందాదారులను, వాజ్మయాభివృద్ధి గోరుసజ్జనులను మమ్మునుగుఱించి యితరులు వ్రాయునట్టి వ్రాతలను నిజమని నమ్మగూడదనియు, వారికి మమ్ముగూర్చి యేమియైనను తెలిసికొనవలసియున్న యెడల మాకు నుత్తరములు వ్రాసి తెలిసికొనవచ్చుననియుందెల్పుచున్నాము.

ఇది యిట్లుండగాకితముకఱవు గ్రంథ ప్రకటనకు మిక్కిలి చిక్కుకలిగించుచున్నది. కాగితము వెల పూర్వము కంటె మూడురెట్లు హెచ్చినది. ఆ వెల యిచ్చినను వలయునట్టియు, వలయునంతయు గాగితము దొరకుటలేదు. అందుచే బలువిధములైన కాగితములమీద నచ్చుచేయవలసివచ్చుచున్నది. ఇదియుగాక, మాచందాదారులకు మేమిచ్చుచున్న వెలలు పూర్వపు ధరలనుబట్టి యేర్పఱపబడినవి. ఆ ధరలకైనను పూర్వకాలమందు మండలి వారుతప్ప మఱియెవరును గ్రంథముల నిచ్చినవారుకారు. ఇప్పుడు మేమిచ్చుట మిగుల సాహసమనియే చెప్పవలెను. కాని గ్రంథములవెలలు హెచ్చించిన సామాన్య జనములకవి సులభ్యములు కావని మేము నష్టమునకైననోర్చి యెప్పటివెలకే యిచ్చుచున్నాము. ఇట్టి యిబ్బందులవలన బూర్వమువలె త్వత్వరగ గ్రంథములను ఈయలేనందులకు ఆంధ్రసోదరులు మన్నింతురు గాక.

ఇప్పుడు ప్రకటింపబడిన గ్రంథము వృక్షశాస్త్రసంబంధమైన యుద్గ్రంథము. గ్రంథకర్త వృక్షశాస్త్రమును బి.ఏ