పుట:VrukshaSastramu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

మింకను వారి కీయకయు, మండలి వారే తనకేమో నష్టము గల్గించిరని లోకులకు దోచునట్లు తాను వ్రాసి మండలి గౌరవమునకు భంగము కల్గించుటకు యత్నించి నందున, ఆగ్రంధ కర్త నామము దాచి ఈ మాత్రము వ్రాయవలసి వచ్చినది. ఇందునకు మేమెంతయు చింతిల్లు చున్నాము.

గ్రంధము వచ్చునని యెదురు చూచు చుండగా గ్రంధమింకొకరిచే నపహృతముగాగా, మరల గ్రొత్త గ్రంధమును వ్రాయించి ప్రకటించుటకు నెంత శ్రమ పట్టునో యెంత కాలము పట్టునో గ్రంధములు వ్రాయు వారికిని వ్రాయించుకొను వారికినీ చక్కగ దెలియును. మేము వేరుగ జెప్పక్కర లేదు.

ఎట్టి సత్కార్యమునకైనను నిష్కారణమున వైరులుండక మానరు. అందు నీ యేడు బహుమతికై వచ్చిన నవలలో దేనికిని బహుమతి యీయనందున నవలలు పంపిన వారిలో గొందరికిని వారి మిత్రులకును మామీద గోపము వచ్చుట స్వాభావికము. కాని యందునకు మేమేమి చేయ గలము? నిరుడు బహుమతి యిచ్చితిమని కొందరికి గోపము వచ్చెను. ఈఏడు భుహుమతి ఈయలేదని కొందరికి గోపమువచ్చెను..... అందరికి మెప్పింప బ్రహ్మదేవునికైనను తరమా?

ఇట్టి నిష్కారణ వైరులసూయా పరువశులై యప్పుడప్పుడి మండలికి నష్టము కలిగింప వలయునని అసత్య విషయములను బ్రకటించు చుందురు. పత్రికామూలమున వారితో వాద వివాదములు సల్పుచు కాలము వ్వర్థ పుచ్చుటకు మండలి వారికి వ్వవధి, నిచ్ఛయు లేదు. ఇట్టి వాదముల వలన నేమియు