పుట:VrukshaSastramu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55

వృక్షముల విభాగము

లోకములో ఇన్ని చెట్లు కలవు గదా.... వీనిలో ఏదైనను గావలసి వచ్చి తెమ్మని యొకరితో జెప్పునపుడు దాని యానవాళ్ళను జెప్పుటయు, దానిని గుర్తించుటయు జాల ప్రయాస కరమగు పని. వృక్షములన్నిటిని కొన్ని సముదాయములుగ విభజించి ఈ సముదాయము లోని మొక్కయని చెప్పుచో శ్రమ తగ్గుచున్నది. కావుననే మొదట నట్లు విభజించి యున్నారు. అన్ని చెట్లకును, ఆకులు, పువ్వులు, కొమ్మలు అన్నియు నుండగ, దేనిని బట్టి బిభజించుట తోడనే తెలియ రాక పోవచ్చును. కొన్ని మొక్కలు మహావృక్షములుగ బెరుగుటయు, కొన్ని చిన్నవిగ బెరుగుటయు కొన్ని నేలనంటుకొని యుండుటయు, జూచు చున్నాము. వాని పరిమాణమును బట్టి విభజించుట మంచి పద్ధతియే యని చూపట్టు చున్నది. కాని ఒకటే మొక్క కొన్ని చోట్ల బాతినపుడు పెద్దదిగను కొన్ని చోట్ల చిన్నదిగను బెరుగు చున్నది. కావున పరిమాణమును బట్టి విభజించిన లాభము లేదు. ఆకులను బట్టి విభజింప ప్రారంభించినను లాభములేదు. మొక్క ఎట్టిచోట్లబెరిగినను మారకుండునది దాని పుష్ప మొక్కటియే. కావున పుష్పమును బట్టియే విభజింపవలెను. బూజు, వర్ణములు, పాకుడు, నీటి పాచి మొక్కలే యైనను వాని