పుట:VrukshaSastramu.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎగిరిపోవుటకు వీలు నిచ్చుచున్నవి. కొన్ని గింజలపై పొర వెడల్పై రెక్కల వలెనైన గింజలు గాలిలో నెగిరి పోవుటకు వీలునిచ్చుచున్నవి. మరి కొన్ని కాయలకు నిట్టి రెక్కలేదో విధమున గలుగుచున్నవి. వీని నన్నిటిని మరియొక గ్రంధమునందు దెలుపవలెనుగాని ఇచ్చట నవకాశము లేదు. ఆముదపు గింజలు ఒక విధమగు పురుగును బోలి యుండుటచే కొన్ని పక్షులు వానిని జూచి పురుగులని భ్రమించి వానిని దినుచున్నవి. కాని వాని నరిగించుకొనలేవు. ఆపక్షులెగిరి పోయి మరియొక చోట రెట్ట వేయ నచ్చట ఈ గింజలు మొలవగలుగుచున్నవి. ఉత్తరేణి కాయలు మన బట్టలకును మృగముల చర్మములకును నంటుకొనుచున్నవి. పల్లేరు కాయల ముండ్లు మన కాలిలో గ్రుచ్చుకొనుట చేత వానిని మనమే దూరముగ విసరి వేయు చున్నాము. ఈ రీతినే, ఇంక ఎన్నెన్ని యో వ్యాప్తి చెండుటకు మార్గములున్నవి....