పుట:VrukshaSastramu.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

అచ్చట నున్న రంధ్రములో నీరు చేరి నొక్కుట చేత బయ్టకు వచ్చు చున్నది. ఈ రంధ్రము అండములో కూడ నుండెను. దీని ద్వారానే పుప్పొడి నుండి కణమొకటి వచ్చి చేరెను. ఇది అండ వివరము, చింత గింజ వేప గింజ మొలక లెత్తగనే పచ్చని రెండు బద్దలును వాని నంటుకొని విడిపోవుచు, విడి పోవుచు గోధుమ రవ్ణము గల పొర యొకటియు గనబడు చున్నది. తిన్నగ పరీక్షించి చూచిన యెడల నొక పొర కాక రెండగు పడు చున్నవి. ఈ గింజ పొరలకు అంతర్త్వక్కు, బహిర్త్వక్కు అని పేరు. ఆ బద్దలుబీజ దళములు.

తామర, ఆముదపు గింజల వంటిదే మరియొకటి గలదు. ఇది భీజము నావరించుట లేదు. దీనికి బీజ పుఛ్చమని పేరు.

చిక్కుడు కందిగింజలలో మొక్క మొలవగనే దాని పోషణకు కొంత యాహారము బీజదళములో నిలువ చేసికొని యున్నవి. అందు చేతనే ఇవి లావుగ నుండును. మొక్క ఆముదము, సీతా ఫల గింజలోని ఆహార పదార్థము బీజదళములలో నుండక వేరే యున్నది. దీనికి అంకురచ్ఛదనమని పేరు.