పుట:VrukshaSastramu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయ ప్రస్తావన


ఇది విజ్ఞాన చంద్రికా గ్రంధ మాలయందలి 30 వ పుష్పము. 29 వ పుష్పము ప్రకటింపబడి నేటికి సవత్సరము దాటినది. ఇంత కాలము వరకు ఏ గ్రంధమును బ్రకటింపక యుండుటకు గారణము లేక పోలేదు. కొందరు గ్రంథకారులు గ్రంధములు వ్రాసి యిచ్చెదమని వగ్దానము చేసి, మాయొద్ద నుండి కొంత ధనము తీసికొని 'గ్రందమిదుగో పంపెదము, అదుగో పంపెదము ' అని చెప్పుచు కాలము గడిపి, చివరకు గ్రంధము వ్రాసి మాకు తెలియ కుండ ఇతరులకి9చ్చి ప్రకటించిరి. న్యాయ సాశ్త్రము ననుసరించి, మేమాగ్రంథ కర్తల గ్రంధములు ఇతరు లెవరును అమ్మకుండ జేయవచ్చును. గ్రంధ కర్త ప్రకాశకుల యెద్దనుండి నష్టమును రాబట్టు కొన వచ్చును. కాని, మండలి వారికి ఎంత నష్టము వచ్చినను గ్రంధ కర్తలకు ఏ విధమైన బాధయు కలిగించుట వారి ఉద్దేశము కాదు గనుక మేమందున గురించి వ్వవహారము జరుపక పోవుటయే గాక, ఈ గ్రంధకర్త మమ్మిట్లు మోస పుచ్చెనని లోకమునకు తెలుపను కూడ లేదు. కాని యోకానొక గ్రంథ కర్త, మగని గొట్టి మొర బెట్టుకొన్నట్లు తాను మండలి వారి డబ్బు తిని వారితో జేసిన కరారునామాకు భంగము కలిగించియు, మండలి వారి హక్కగు గ్రంధమింకొకరికిచ్చి మండలి వారి వలన బొందిన ధన