పుట:VrukshaSastramu.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47

మూడుగదులు, మూఫు వెలుపలి గోడలునున్నవి. పగులు రెండు వెలుపలి గోడలకు మధ్యనున్నది. గదికిని గదికిని మధ్యనున్న సరిహద్దుగోడ పగులు చున్నది. ఇది భిత్తిదారుణము. గంగ వారి, చిలగడ దుంప తీగె కాయలు పగులుట లోనే వరుస, రీతియు లేవు.

బొమ్మ
ఆముదపు కాయ, భిత్తి దారుణము.

గసగసాల కాయలో పైన చిల్లు లేర్పడి వాని నుండి గింజలుబైటకు వచ్చు చున్నవి. ధాన్యము ఇవిఫలములు గాని గింజలు గావు. కొబ్బరి జీడి మామిడి గింజ (నిజమగు కాయ) లందు కాయ పగులుటయే లేదు. వీనికి కఠిన ఫలములని పేరు.

గింజలను గోడల కంటించుచు సన్నని చిన్న కాడలు గలవు. వీని యానవాళ్ళుగింజలమీద నగుపడును. ఈకాడలకు బీజబంధములని పేరు. ఆ యానవాళ్ళను చంధక చిహ్నములందుము. చిక్కుడు శనగగింజలను నీళ్ళలోనానవేసి, కొంచెముసేపైన తరువాత వానిని నొక్కిచూచిన ఒక చోటినుండి నీటి బుడగలు వచ్చుచుండునట్లు అగపడును.