పుట:VrukshaSastramu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

గది గోడలును (కాయ చర్మము) పలుచగనున్నవి. కాయపై భాగముమూత వలె విడివచ్చుచున్నది. ఇట్టివె పేటికాఫలములు కొన్ని కాయలకు ఎగిరిపోవుటకు వీలుగ నుండునట్లు రెక్కలు గలవు. అవి రెక్కలకాయలు.

బొమ్మ
కుంరంగ వాము కాయ. రోష్ట దారుణము.

ఎండిన కాయలు పగులుచుండుట రెండు మూడు విధములుగా నున్నది. బెండ కాయ అయిదు పలకలుగా నున్నది. ఈ అయిదు పలకలును అయిదు గదుల యొక్క వెలుపలి గోడలు. ఈ వెలుపలి గోడలే బగులుచున్నవి. ఈ పగులు తిన్నగ గదిలోనికే వ్వాపించి గింజలు పైకగుపించును. ఇట్లు పగులుటను కోష్టాదారుణమందుము. ఆముదపు కాయలో