పుట:VrukshaSastramu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

దెచ్చుటయే వీని పని. సొంపుగ నుండి, భృంగాదులను రంగు చేతనో, వాసన చేతనో, ఆకర్షించి గర్భాదానము గావించును. అది యెడగూడిన తోడనే ఆకర్షణ పత్రములు రాలి పోవు చున్నవి. కింజల్కముల నుండి పుప్పొడి పోగానే అవియు వదిలి పోవుచున్నవి. కీలము ద్వార పుప్పొడి (కణ మొకటి) అండమును జేరిన పిమ్మట కీలమును రాలిపోవును. అండాశయమొక్కటి మాత్రమే నిలచి యుండి, గింజలతో గూడ బెరుగుచు, కాయ, పండు, అగును. వంగ, దానిమ్మ, జామ కాయలలో పుష్ప కోశము కూడ కాయ నంటి పెట్టుకొని స్థిరముగా నుండు చున్నది.

ఫలములు

కొన్ని కాయలు పండి ముదిరిన పిదప అరటి, మామిడి, ద్రాక్షపండ్ల వలె కండ గలిగి మెత్తగా నుండును: కొన్ని చిక్కుడు, బెండ, కాయలవలె ఎండిపోయి కండ లేకుండ నుండును. అరటి మొదలగువానిని గుంజ కాయలనియు, చిక్కుడు బెండ కాయలను ఎండు కాయలనియు, జెప్పుదుము. మామిడి పండులోని టెంక గింజ కాదు. గింజ ఆ టెంక లోపల నున్నది. టెంక కూడ పైచర్మము, గుంజు, వంటి భాగమే. అది మాత్రము గట్టిబడి నానినుండి విడియున్నది. ఇట్టి కాయలను లోపెంకు కాయలందుము. కొబ్బరికాయయు లోపెంకు కాయయె. పైన వుండవలసిన కండ పీచుగా మారి యున్నది. విత్తనమును, ఆకాయ లోపల నున్నది. అరటి పండు, నందును