పుట:VrukshaSastramu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39

సంయోగమనియు; బెండ, మందారము మొదలగు వానిలో స్థంభ సంయోగమనియు చెప్పుదుము.

బొమ్మ. (1.కుడ్య సంయోగము, 2. మధ్య సంయేగము. 3. స్థంభ సంయోగము


అండాశయములో నిల్లిక్క గదియే యున్న కొన్నిటిలో అండములు గదిగోడతో జేరక మధ్యగా నున్నవి. ఇట్టి దానిని మధ్య సంయోగమ మందుము. బంతి మొదలగు కొన్నిటియందు ఒక అండమే కలదు. అది అండాశయము యొక్క అడుగును జేరియున్నది. ఇది పీఠ సంయోగము. పుప్పొడి వచ్చి అండ కోశమును చేరుటయే పుష్పము లందలి గర్భాధానము. ఇది ఎట్లు సమకూరుచున్నదో, తరువాత సంయోగము, గర్భాధారణము ఎట్లు కలుగు చున్నవో మీరిది వరకే జీవ శాస్త్రమునందు చదివియున్నారు. గర్భాదానమైన పిదప అరక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు, కింజల్కములు, కీలము రాలిపోవును. వాని పని నవి నెరవేర్చినవి. రక్షక పత్రముల పని మిగిలిన భాగములను కాపాడుటయే. ఆకర్షణ పత్రములే పుష్పమునకు అందము దెచ్చును. ఆముదము