పుట:VrukshaSastramu.djvu/490

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

487

ఈపొడుగాకులు, పొలుసులమధ్య పుట్టిపుట్టకుండగనున్న కొమ్మమీద నుండి పుట్టుచున్నవి. ఇట్లు నిర్గోచరములగు కొమ్మల మీద పెద్దాకులును, పెద్ద కొమ్మల మీద చిన్నాకులును గల్గు చున్నవి. ఒక్కొకప్పుడు నిర్గోచరముగా నున్న కొమ్మలు కూడ పెద్దవై పెరుగును. అన్ని చెట్లయందును నాకులీరీతిని లేవు. కొన్ని చెట్లలో పొలుసులు లేవు. కొన్నిటిలో మిక్కిలి చిన్న చిన్నవిగా నున్నా ఆకులు కొమ్మల నంటి పెట్టుకొని యున్నవి. మరి కొన్నిటిలో అంగుళము పొడుగు అరంగుళము వెడల్పుగానున్నవి. మదనమస్తుచెట్టులో ఈతాకుల వలె పక్షవైఖరి నున్నవి.

మాను, ఆకులు అంతర్భాగముల నిర్మాణములో కొన్ని భేదములు తప్ప, ద్విదళ బీజకపు వృక్షములను పోలి యున్నవి. వీని పుష్పములందు మాత్రము వ్యత్యాసము చాల గలదు. పుష్పములు కొన్ని లక్షణములలో పర్ణములను పోలి యున్నవి. దేవ దారు మదన మస్తు మొదలగు చెట్ల యందు కణుపు సందులందుండి గాని, కొమ్మల చివరలందుండి గాని కంకులు పుట్టు చున్నవి. మధ్య కాడ నంటి పెట్టుకొని బిరుసుగ కొయ్య బారిన అరేకులు గలవు. ఈ పెద్ద రేకుల కడుగున చిన్న చిన్న పొలుసులున్నవి. ఆ పెద్ద రేకుల మీద అండములో, పు