పుట:VrukshaSastramu.djvu/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

447

దు. చిన్న మొక్కలకు గడ్డి చుట్టుట మంచిది. చెట్ల కు పువ్వులు పూయునపుడు నీళ్ళు బోయ రాదు గాని కాయలు కాసిన పిమ్మట విస్తారముగ పోయ వలెను. ఖర్జూరపు చెట్టు సాధారణముగ నెనిమిదేండ్లకు కాపునకు వచ్చును గాని అది నేల సారమును బట్టి యుండును. ఈ కంకులను గప్పుచు మట్ట యొకటి గలదు. స్త్రీ పుష్పములపై నున్న మట్ట చీలిన పిమ్మట్ను (ఈ మట్టలు పువ్వులు పెద్దవి కాగనె చీలును) పురుష పుష్పముల మట్ట చీలి పోవునపుడు దీని నుండి కొన్ని కంకులను కోసి స్త్రీ పుష్పముల మధ్య నిమిడ్చెదరు. అట్లు చేయ కున్నను కాయలు గాయును గాని, అది గాలిని బట్టి యుండును. ఒక్కొక్కప్పుడు, అట్లు చేయకున్న యెడల కాయలుగాయక పోవుటయు కలదు. ఈ రీతి నిముడ్చుట వలన పుప్పొడి ప్రతి స్రీ పుష్పమును చేర గల్గును. ప్రతి పువ్వు నుండి పెరుగు మూడు కాయలలోను చిన్నవిగ నున్నపుడే రెండు రాలి పోవును. అందుచే ఆహారము మిగిలి యున్న నొక దానికి సంవృద్ధిగ పోవును. ఒక్కొకప్పుడు కాయలు నీరసముగ నుండునని తోచిన యెడల కొన్నిటిని చిన్నవి గానున్నప్పుడే కోసి వేయుదురు. ఆ మిగిలిన కాయలకపుడాహారమెక్కువగ పోయి ఏపుగపెరుగును.

ఖర్జూరపు చెట్లు విరివిగా పెరుగు చోట చాపలు బుట్టలు, విసన కర్రలు మొదలగునవి వీనిఆకుల తోడనే నేచెసెద