పుట:VrukshaSastramu.djvu/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

419

అండకోశము. అండాశయము నీచము. 3గదులు. అండములు మధ్యస్థంభ సంయోగము, కీలము, గుండ్రము. కీలాగ్రము చిన్నది.

ఈ కుటుంబపు మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఆకులు సమ రేఖ పత్రములు ప్రకాండము భూమి లోపలనే యుండును. పుష్ప భాగములన్నియు నొక్కొక్క వలయమున మూడో, ఆరో గలవు. ఈ కుటుంబపు మొక్కల అండాశయము ఉచ్చము. వీని యండాశయము నీచము. ఇది యే భేదము.

ఈ కుటుంబములో ఉపయోగమైన మొక్కలంతగా లేవు.

కేసరి పువ్వులు ప్రాతః కాలమున వికసించి అందముగాను పరిమళముగాను నుండుటచే తోటలందు బెంచు చున్నారు.

కిత్తనార మొక్కయే ఈ కుటుంబములో మిక్కిలి యుపయోగమైనది. అది పెక్కు చోట్ల గంచెలు కంచెలుగా పెరుగు చున్నది. నివాట్టమలే ఆకులు, మట్టలు, మిక్కిలి ద