పుట:VrukshaSastramu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

గుండ్రముగా నుండి మధ్య నొక దంతమును గలిగి యున్నవి. కొన్నిటిలో మధ్యకు చీలి యుండి, ఆకును తలక్రిందులుగా బెట్టి చూచిన హృదయాకారముగ నగుపడుదు. వీనిని అధశ్శిర హృదయాకారమమందుము. ఇట్లే అధశ్శిర అండాకారము, కొన్నిటి చివర కొంచము లోపలకు దించుకు పోయినట్లుండును; ఇట్టి దానిని ఖనితమందుము. చించాకుల చిట్టిఆకులలో నున్నట్లు కొన్నిటి చివర ఒనదేరక, దోసి వేసి నట్లుండును. ఇట్టి దానిని క్షిప్తము అందుము.

బొమ్మ
విషమరేఖ పత్రము:
విషమ రేఖ పత్రము

అకులమీద సాధారణముగ మధ్యనొక పెద్ద ఈనె యుండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితో నొకఆటి శాఖోపశాఖలై కలిగియున్నవి. ఇట్లు ఒక దానితో నొకటి కలియు చుండిన విషమ రేఖ పత్రమందుము.