పుట:VrukshaSastramu.djvu/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

357

ము ఒకటి ఫలముపేటికాఫలము; సాధారణముగ పుష్ప కోశములోనె మరుగు పడియుండును.

బచ్చల కాడలో నాలౌగైదు రకములు గలవు. వీనిలో ముఖ్యమైనది పెద్ద బచ్చలి. దీనిని తీగె ముక్కలు నాటియే పెంచ వచ్చును. ఆకులు కాడలు కండ కలిగి యుండును.

ఎర్ర బచ్చలి, మట్టు బచ్చలి అంతగా వాడుటలేదు. వీనిని గింజలను పాతి మొలపింతురు. పాదులు పెట్టకనే డొంకల వద్ద మలచు బచ్చలి కాడ ఇంత కంటే సన్నముగానుండును. తినుటకును అంత బాగుండదు.

ఈలకూర కొమ్మమీద ఆకులు దూర దూరముగ నుండును. వీనిని కూర వండుకొని తిందురు. 1871 - 72 వ సంవత్సరములలో క్షామము పట్టినపుడు ధనికులు కూడనీయాకులను దినిరట. ఈ మొక్కలు పెరుగుటకు వర్షము లేకున్నను అంత ఇబ్బందిలేదు. ఈఆకులరసమును పండ్ల జబ్బులకు మంచి దందురు.

రవకాడ సముద్ర తీరముల ఇసుకనేలలో పెరుగును. దీనికొమ్మలు నేలపై బడి వేళ్ళువేయును. ఇది సముద్ర తీర