పుట:VrukshaSastramu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెనే, గొగ్గి గొగ్గిలుగా నుండక సమముగా నుండును. అట్టి వాని అంచు సమాంచలము. గులాబి అకున గొగ్గి గొగ్గిలు కలవు. వానికి పోలికను బట్టి రంపపు పండ్లని పేరు వచ్చినది;

బొమ్మ
(1. సమాచలము. 2. అంచు: రంపపు పండ్లు. 3. దంతములు. 4. వలయ దంతములు.)
గులాబి ఆకు

ఇవి తిన్నగా నుండక కొంచము అయిమూలగ నున్నవి. మందారపు ఆకులలో వలె తిన్నగా నుండిన వానిని దంతములందుము. కొన్నింటిలో ఈ గొగ్గిల కొన సన్నముగా నుండక గుండ్రముగా నుండును. అవి వలయ దంతములు. తొగరు, నర మామిడి ఆకులయంచున గొగ్గిగొగ్గిలుగా లేదు గాని, పైకి క్రిందకు వంపులు గలిగి కెరటముల వలె నున్నది. ఇట్టి దానిని తరళిత మందుము. (వెనకటి పుటలలోని పటమును జూడుము) ఆకుల కొనయు కొన్నిటిలో రావి ఆకునందు వలె వాలము కలిగి యున్నది. గన్నేరు ఆకులో సన్నముగా నున్నది. మర్రిఆకులో గుండ్రముగా నున్నది. కొన్నిటిలో