పుట:VrukshaSastramu.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

ధనములో కూడ పనికివచ్చును. వేళ్ళ బెరడునుండి జిగట్ విరేచనములకు మందు చేయుదురు. ఆకులు కాచి నొప్పులకు పట్టు వేయుదురు. జిల్లేడు రసమూ దాల్చిన వేళ్ళు కాల్చిన బొగ్గు బాగుండును.

సుగంధితీగెకు ముండ్లు గలవు. దీని వేరు ఔషధములలో వాడుదురు. అది సన్నముగను పొడవుగను వుండి సువాసన గల బెరడు కలిగి యుండును. వేళ్ళు దేహమునకు బలము కలుగ జేయును. వేళ్ళేగాక, ఎండుటాకులను రెమ్మలను కూడ వాడుదురు.

మంచి మాడు తీగె
- దొంకల వద్ద మొలచును. ఆకులు మిక్కిలి దట్టముగా నుండును. పువ్వులు కొంచ మాకు పచ్చగను, కొంచె ఊదాగను నుండును. దీని కాడలను వేళ్ళను కూడ కొందరు వండుకొని తిందురు.
కొమ్ము మాడు
- వేళ్ళు అంతకంటే లావుగ నుండును. వీని నంతగా దినరు.
తీగె జెముడు
- డొంకలనల్లుకొని యుండును. దీనికి ఆకులులేవు. దీని చిన్న తెల్లని పువ్వులు మంచి వాసన వేయును.