పుట:VrukshaSastramu.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

267

గడ్డి మొక్కలు పెరుగలేవు. మరియు మధ్యమధ్య నున్న మొక్కలను నాలుగైదేండ్లు వచ్చిన తరువాత పెరికివైచి వానినుండి బెరడు తీయ వచ్చును. పండ్రెండు పదు నాలుగు ఏండ్లయిన పిదప మొక్కలను పూర్తిగ లాగి మాను నుండియు వేరు నుండియు బెరడు దీయుదురు. బెరుడుతో లోపలి దారువు కూడ వచ్చిన లాభము లేదు గావున పదునెనిమిదేసి అంగుళముల దూర దూరమున చెట్టు చుట్టు నరుకుబెట్టి రెండు నరుకుల మధ్య నిలువుగా కోయుదురు.


అట్లు మొక్కలను బెరికి వేయక నెదుగనిచ్చునపుడు చెట్ల యొక్క కొమ్మలనే కొట్టుదురు. లేదాచెట్టునే మొదలు వరకు నరుకుదురు. ఈ మొండెము నుండి కొమ్మలు బయలు దేరు పెద్దవగును.కొన్నిచోట్ల మానునకు రెండు వైపుల మాత్రమె ఒక యంత్రము మూలమున బెరడును కొంచెము లోతుగనే చెక్కుదురు. తరువాత నచ్చట బెరడు కూడ వచ్చును.

తీసిన బెరడు నంతయు నెండ బెట్టి యంత్ర శాలకు పంపుదురు. యంత్రశాలలో నేమిజరుగునో, బెరడులో నేయే