పుట:VrukshaSastramu.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శము విష్టాకారముగనున్నది. గింజలు చిక్కుడుగింజలవలె నుండును గాని అంత కంటె పెద్దవి. చేదుగానుండుట చే దినుటకుపయోగింపవు.

అలచంద మొక్కయు తీగెయె. పువ్వుల కాడలాకులకంటె పొడగు. నీని కాయలు కూర వండుకొందురు. కొన్నిటి గింజలు తెల్లగాను కొన్నిటివి నల్లగా నుండును. తెల్లగింజల కాయలే కూరకు మంచివి.

కరి అల్చంద:- తీగె యొక సంవత్సరములోనే చచ్చి పోవును. పువ్వులు జంట జంటలుగా నుండును.

కసమర్ద:- (చక్ర అర్ద) తగరిస మొక్కలొకతీరుననే యుండును. వీని ఆకుల రసము తామరను పోగొట్టును.

నల్లబెండ:- తీగెనేలమీద ప్రాకుచుండును. ఆకులు హృదయాకారము సీతాకాలములో పచ్చని చిన్న పువ్వులు పూయువు.

తెల్లతీగె:- చెట్లమీద ప్రాకును. వదిజతలచిట్టి ఆకులు గలవు. పువ్వుల్లో నొక రేకునకు పాదముగలదు.

కరకండి తీగె:- చిట్టిఆకులు మూడింటిలోను చివర నున్నది పెద్దది. ఆకులపై దట్టముగా రోమములుగలవు. పువ్వులు పసుపు రంగు.