పుట:VrukshaSastramu.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీరుజీలుగ:- ఎవరు పెంచుటలేదుకాని వానియంతటయె నీళ్ళలో మొలచు చున్నవి. వరిచేలలో కూడ నీరు నిలిచి యున్న చోట మొలచు చున్నవి గాని వానిని బెరికి వైచుచున్నారు. దీనియుపయోగములు చాల కాలమువరకు దెలియ లేదు. ఇది సీసాలకు బిరడాలుగ నుపయోగించును.

దీని ముఖ్యమైన ప్రయోజనము టోపీలును దలపాగలను చేయుట. జీలుగు బెండులను లావుగ నున్న వాని కోసి ఎండు వరకు నొక గదిలో వేసెదరు. ఎండిన పిమ్మట పైపొర తీసి వేసి పదునగు కత్తితో కాగితములంత పలుసగ కోసెదరు. రాగడి మట్టితో టోపి వలెనో దలపాగ వలెనో జేసి ఆయచ్చును బట్టి జీలుగు రేకులతో టోపీలను, దలపాగలను చేయుదురు. కాని సాధారణముగ, ఒక జీలుగు రేకుపైన మరియొక దానిని వేయక, దగా చేసి, మధ్య కాతిగములను బెట్టుచుందురు. పూర్తిగ బెండుతో చేసిన తలపాగ లెండను తలకు తగుల నీయవు. చిర కాలము నుండి జీలుగు బెండుతో చేయునవి ఉత్సవములందు ఉపయోగించు పువ్వులు కాయలే. తంజావూరు జీలుగు బొమ్మలకు ప్రసిద్ధి కెక్కినది. జీలుగు బెండు మిక్కిలి తేలిక యైనది గాన చేపలుపట్టుకొనుటకు గట్టు చిన్న తెప్పలందును, నీటిమీద తేలు ఉపకరణములందును