పుట:VrukshaSastramu.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్క చెక్కనెండ బెట్టి పొడుముచేసి దానినుండి ఎర్రని రంగు చేయు చున్నారు. ఆకులను గింజలను కషాయము కాచి యిచ్చిన కొన్ని దగ్గులకు మంచిది. కలప, ఇండ్లకును, కుర్చీలు, బల్లలు మొదలగునవి చేయుటకును ఉపయోగించును. ఈ చెట్టు నుండి జిగిరు కూడ వచ్చును.

చందనము:- చెట్లు వేసవికాలమందు పుష్పించును. వీని పువ్వులు గొట్టము వలెవుండును. పువ్వు మొక రంగు చేయుటకు వీనిని పెంచెడువారు కాని, ఇప్పుడు చౌక రంగులు వచ్చుట వలన మానినారు. దీనినిప్పుడు బొమ్మలకును, ఇంటి స్థంభములకును నాగళ్ళకును ఉపయోగించుచున్నారు.

బాడిత:- చెట్టుబెరడు నున్నగానుండును. మూడు చిట్టి యాకులలోను కొకటి పెద్దది. బాడిత చెటేటు ప్రత్యేకముగ ఉపయోగమైనది గాకున్నను ఉపయోగమైన వాని పంట నెక్కువ చేయును. దీని వేరుల నాశ్రయించు కొనియుండు సూక్ష్మ జీవుల సాయమున మొక్కలకు నావశ్యకమైన వాయువు నెక్కువగా భూమిలోనికి జేర్చును. ఇదియో ఈమొక్కచేయు లాభము. ఈ కుటుంబము మొక్కలన్నిటికిని కొంచెము, గొప్పయె గలదు. పాతిన మొక్కలు ఈ తీరున భూములను సార వంతములుచేయుటకై, ముఖ్యముగా తేయాకు, పోక, కాఫీ, తోటలందు బాతుదురు.