పుట:VrukshaSastramu.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కింజల్కములు సాధారణముగా బది యుండును. అంతకు నెక్కువయు తక్కువయు నుండుట కలదు. అండాశయము ఒకగది. కాయ ఎండి రెండు వైపుల బ్రద్దలగును. ఇదియే నీ కుటుంబపు ముఖ్య లక్షణము. కొన్నిటి పువ్వులు చిక్కుడు పువ్వుల వలె కీటాకాకారముగను మరికొన్నింటిలో కసింత చింత పువ్వులలో వలె పువ్వులకు ఇంచు మించు సమముగా తుమ్మ సీమ చింత మొదలగు కొన్నిటి యందు పువ్వులు చిన్నవిగాను బంతులుగాను నుండును. ఈ భేదములను బట్టి నీకుటుంబమును మూడవ కుటుంబములుగా విభజించి యున్నారు.

చిక్కుడు:- పాదును శీతకాలములో బెట్టుదుము. అవి సంక్రమాణము నాటికి సమృద్ధిగ కాయలుకాయుచుండును. నల్ల రాగిడి నేలలోని పాదులు బాగుగ నుండును. చిక్కుడు లలో నల్లచిక్కుడు, తెల్ల చిక్కుడు, పెద్ద చిక్కుడు మొదలగు పెక్కు తెగలు, రకములు గలవు. వీని పుష్పములు కొన్ని పూర్తిగ తెల్లగను, కొన్ని నీలముగను, కొన్ని ఇతర రంగుగను నుండును. చిక్కుడు కాయలు బలము నిచ్చుకూర. ఈకుటుంబములో చేరిన పప్పులన్నియు కూడ బలమునిచ్చును. కొందరు చిక్కుడు గింజలనెండ బెట్టి నిలువ చేసి కొందురు.