పుట:VrukshaSastramu.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

153

బాలింత బొలము
- చెట్లు మన దేశములో నంతగా లేవు. ఈచెట్లనుండియు జిగురువంటిపదార్థము వచ్చును. దీనిని ఔషధములలో వాడుదురు.
నల్ల రోజను
- చెట్లు పడమటికనుమలదగ్గర నెక్కువగా బెరుగు చున్నవి. వీని నుండి వచ్చు జిగురు వంటి పదార్థముతో దగ్గు మొదలగు వానికి, గుండెల మీద పట్టు వేయుదురు.
ఫరంగి సాంబ్రాణి
- చెట్లు కొందల మీద బెరుగును. దీని నుండియు జిగురు వచ్చును. దీనిని పొడుము గొట్టి పంచదార కలపి నీళ్ళలో వేసి పుచ్చుకొన వచ్చును. ఆజీర్ణ విరేచనము మొదలగు నవి కట్టును. ఈ పొడిని మంచి నూనెలో నైనను, గసగసాల నూనెలో నైనను, గలిపి కాచి, వడగట్టి, తలకు రాచు కొనుచున్న యెడల దలవెండ్రుకలు పెరుగును.
అండుగపిసను
- చెట్టును పై దానివలెనే యుండును. ఈ పదార్థమున కొక విధమగు సువాసనగలదు. దీనిని గుగ్గిలము సాంబ్రాణి పొగ వేసినట్లు పొగ వేయుదురు. ఈ చెట్టు కలుప గట్టిగానె యుండును. దీనితో తరుచుగా తేయాకు పెట్టుటకు పెట్టెలు చేయుదురు. వంట చెరుగుగ కూడ బాగుండును.