పుట:VrukshaSastramu.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునుండియే బోవుచుండెను. అమెరికా ప్రత్తి మేలు రకమగుటచే నిప్పుడు దాని కెక్కువ ఖరీదుగలదు. ఈ ప్రత్తి పోగులు పొడుగుగా నుండును. ఈ రకము మనదేశము లోను నాటిరి గాని యచ్చట వలె బెరుగ లేదు. ఇదివరకే ప్రత్తిలో బెక్కు తెగలును బలురకములును గలవు. ఏరకము మంచిది, ఏది సులభముగా బెరుగును అని చర్చలిదివరకే చాల జరిగెను. ఇప్పుడనేక రకములు పెరుగు చున్నవి. మన దేశపు ప్రత్తి కనుగుణముగా నుండెడు మరలను చేసిరి, మన ప్రత్తికి ఇంగ్లండు నందు తక్కువ ధర యుండుటయు, తక్కువ ధరయగుటచే మంచి ప్రత్తిని బెంచుటకుపేక్షజేయుటయు, అన్ని రకములను కలగలపుటయు దటస్థించుచు వచ్చెను గాని యిప్పుడు, మంచి రకములకు వేరు వేరుగా దగిన తావులందు పైరు చేయు చున్నారు. దీనిని సాగు చేయుట నేలను బట్టియు, అచ్చటి శీతోష్ణస్థితులను బట్టియు బ్రత్తి రకమును బట్టియు నుండును. కొన్ని చోట్ల దీనిని కందులు, జొన్నలు, నువ్వులు, మొదలగు వానితో గలిపి చల్లుదురు. కొన్ని రకముల గింజలను జల్లునపుడు వాని నంటుకొని పూర్తిగ నూడక యున్న పోగులు మూలమున గింజలొకదానికొకటంటుకొనకుండు నట్లు పేడ, ఇసుక మొదలగు వానిలో వాని బొర్లించెదరు. కొన్ని చోట్ల నెండిన కాయల నెల్ల గోయుదురు; మరి కొన్ని చోట్ల