పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

విజయనగర సామ్రాజ్యము


. అమాయకులగు పౌరులలో జాలమంది యహహ ! యితఁ డెంతమంచివాఁడు ' అనిరి. మఱి కొందఱు నిజముగా నితఁడు తురక కులమున జన్మింపఁదగిన నాఁడుకాఁడ' నిరి. “ రామరాజున కందుచేతనే యితఁడు పుత్రుఁడగుటకుఁ దగు' నని మఱికొందఱనిరి. దూరదృష్టిగల కొందరు మాత్రము “అది కేవలము టక్కరితనము.జనాను రాగము కొఱు కితఁడిట్లు చేయు చున్నాఁడు. ఇవి హృదయమునుండి వచ్చిన మాటలు కావు ' అని గుసగుస లాడిరి. అం దెవరిమాట సత్యమో, ఎవరి కెఱుక ? పిదపఁ జక్రధరుఁడు లేచి నిలువఁబడియిట్ల నెను.'

“ఆర్యులారా ! చక్రవర్తీ!

శ్రీ యాదిల్శాహాగారు చెప్పిన దెంతయు వర్ణద నీయము గానున్నది. తొందరపడి శ్రీమహా మంత్రిగారికి మరణదండి సము విధించిన నిశ్చయముగాఁ దరువాత మనకు నష్టము వాటి ల్లును. కావున వారిని ధర్మశాస్త్ర పరిజ్ఞతలమూలముగా విచా రించుటయుఁ దరువాత దేవరవారి చిత్తమునచ్చినట్లు సేయుట యు సమంజసముగాఁ దోఁచుచున్నది. ”]

అంతఁ జక్రవర్తి లేచి యిట్లనెను. " ప్రస్తుతము నిన్ను కారాగారమున నుంచుటయే మంచిదని తలఁచితిమి. మరణ దండన మక్కఱ లేదు”

బుద్దిసాగరుఁడు వంచిన తలను గొంచెమెత్తి యిట్లనెను.

"నేను ద్రోహినో కాదో యీశ్వరుని కెఱుక . దానింగూర్చి