పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

73


.

లున్నవి. అవి యన్నియు మఱి యొక యుత్తరము ద్వారా పంపెదను నేఁడు పంపఁజూలసందులకుఁ జాల చింతిల్లు చున్నాఁడను. ఇపుడు నాస్థితి యిచటఁ బూర్వమువలె లేదు. పూర్వ మీరాజ్యమునకు నేను నిరాఘాట చక్రవర్తిని. ఇప్పుడు నాతంత్రములు నిరాఘాటముగా" సాగుచుండుట లేదు. అందు నలన గొన్ని చిక్కులు సంభవించుచున్నవి. అయినను మించి నది లేదు. నేను మీరు కోరిన సర్వమును మీకుఁ గూర్చ గలను. కొంచెము కాలవ్యవధి మాత్రము కోరుచున్నాను. చిత్తగింపుఁడు.

బుద్ధిసాగర్యుడు.”


అతఁడుత్తరమును సాంతముగాఁ జదివి క్రిందనున్న దస్కతును, అందఱఁజూడఁగోరెను. ' బుద్ధిసాగరుఁడు ' అను దస్కతందు స్పష్టముగాఁ గసం బడుచుండెను. బుద్ధిసాగరుడును తలవంచుకొనెను. అతని కేమియుఁ దెలియ లేదు. ఇట్ల, తల పోసెను.

“ నేననుకొన్నంతయు నైనది. అగుఁగాక ! నా చేవ్రాలు వీరి కెట్లు లభించినది ? ఇది సృష్టించియుందురా ! "పెక్కుచిక్కు లతోనుండు నా చేవ్రాలును సృష్టించిన వారేది చేయఁజాలరు? ఇంతకును విధి విధాన మిట్లు న్నది. ఇంక నేనీ బ్రదుకేల బ్రదుక వలెను." అతనికన్నుల నీరుగమ్మెను.లోపలఁ గోపాగ్ని తీవ్రము గామండుచుండెను. అతఁడు వంచిన తలను మఱి యెత్త లేదు. కాని పౌరులలోఁ జాలమంది కది కష్టముగనుండెను. అందుఁ