పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

65


కాదా ? దాని కేమిగాని రేపే నీవు పోవుచున్నందులకు మాకు జింత గల్గుచున్నది. అయినను జేయునది లేదు. కాని జగన్మోహినిని మాత్రము మఱువకుఁడు. నన్ను గూడ మన సులో నొకమూల నుంచుకొనుఁడు. అదియే మీరు మాకు చేయు నుపకారము. అందులకిది గుర్తుగా మీ కడనుండుఁ. గాక!'

అని యా పె చిత్ర ఫలకము నా వీరమౌళి కరతలమున.నుంచెను అది యత్యంత స్వాభావికముగఁ జిత్రింపఁబడెను. అందు జగన్మోహిని స్వర్ణ కుమారసమేతయైయుండెను. అతఁడు తన దృష్టిని మజుల్చుకొన లేకపోయెను. ఎట్ట కేలకు ' సుహృ ద్రత్నములారా! మీ | పేమకుఁ జాల సంత సించితిని. ఇదిగో, యీయుంగరమును గైకొని నన్నెప్పుడును మఱవ కుందురు గాత ' అని జగన్మోహిని వ్రేల . దానిం దొడగెను.