పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

విజయనగర సామ్రాజ్యము


కాని మాటలాడఁ బ్రయత్నించుచుండఁగనే అంతలో నంత జ్ఞానమగుచుండు దానవు. నాతోనపుడేల మాటలాడిన దానవు కావు”

స్వర్ణ :-అవును. కనపడిన మాటనిశ్చయమే. యోగిసత్తముం డును, బితృతుల్యుండును విశేషించి మనలఁ బ్రేమించుచు మన క్షేమము నేకోరువాడును నగు శ్రీధరుఁడు నీకు దెబ్బలు తగిలిన తెల్ల వారు ఝామున నన్ను బిలిపించి యావద్వృ త్తాంతమును నాకు నెఱిఁగించెను. అపుడుశిష్యు లెల్లరునానా విధములగు రాజ కార్యముల మీఁదను, శత్రువులు సేయు కుట్రలఁ దెలిసికొనుటకును, బంపఁబడియుండుటచే నెవ రును లేరు. అందుచే నేను నీ సేవకు నిశ్చయించితిని ! కాని శ్రీధరులవారి యాజ్ఞానుసారము నేను నీకుఁగన్పడ లేదు. ఆపత్సమయములో నీకు సేవ సేయు భాగ్యము నాయీచేతు లకుఁ గల్గినందులకు సంతసించుచున్నాను.

జగన్మోహిని యంతయు నాలకించెను. ప్రాణ సఖయగు నా పె యు కీ కిని, జమత్కృతికిని మెచ్చెను.తలయాడిం చెను.తన లో నేమో అనుకొనెను. ఆపై యొక వేళ నా మహామహుని కట్టి యా పత్సమయమున సేన సేయు భాగ్యము తనకుఁ గల్గి నందులకుఁ జంతించెనా యేమి ?

విజయ : -స్వర్ణకుమారీ ! నీ ఋణమును దీర్చుకోఁ జాలను.

స్వర్ణ:-అది మీకృపారసము. అంతపని నే నేమియుఁ జేసియుండ లేదు. ఆ బాల్యమైత్రీ నెసంగు నే నీపాటి సేయుట నాకు విధి