పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

63


' చిరకాలమునకు లభ్యమైన యీదర్శన సౌఖ్య మేని నాల్గు నాళ్ళవఱకు లభించునది కాదు. రేపుదయమె రాజ కార్య నియోగ మొం డత్యావశ్యకమయినది నెఱ వేర్పఁ బోవలసి యున్నది.'

ఇంతలో స్వర్ణ కుమారివచ్చి యచట నిలిచెను. ఆపైయిట్ల నెను. “రేపుమాత్రమేని యుండిన మాకుఁ గొంత సంతస ముగానుండును. దయచేసి రేపుండుఁడు.”

విజయ :-అది రాజ కార్యము. రాజ కార్యము లవశ్యకరణీయ ములు. ఇందు స్వార్థ పరుఁడనై నేనుందు నేని రాజద్రోహ మును దన్మూలమున మాతృదేశ ద్రోహమును జేసిన వాఁడ నగుదును.

జగ : అవును. విజయసింహా ! నీవన్నట్లు రాజు కార్యమునకు మే మడ్డు పెట్టుట ధర్మము కాదు. నీవిధిని నీవుపోయి నిర్వహింప వలసియున్నది. కాని సాధ్యమైనంత త్వరలో నీ వ్యవహార విషయముల కేమియు హానిరాకుండునట్లు వచ్చి చూచి పో వలయునని కోరుచున్నాను.

అత 'డట్లే' అనియెను. అతని కనులొకపరి స్వర్ణకుమారి పై కిఁ దిరిగెను. అతఁడిట్ల నెను.

“ స్వర్ణ కుమారీ! నీవు పర్ణ శాలయందు నేనుగాయములు తగిలి . పరుండియున్నప్పు డొకటి రెండుసార్లు కనఁబడితివి.