పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

విజయనగర సామ్రాజ్యము


నీరాయెను. అతని కేమియుఁ దెలియ లేదు. అతఁడేమి సేయను బ్రయత్నింపలేదు. కాని,యప్రయత్నముగాఁ జేతిరుమాలుతోఁ గూడినయాతని మంజులహ స్త మాజగన్మోహిని కనులకు దుడవ నారంభించెను. రెండవ హస్త మా సౌభాగ్యశాలిని యొక్క కేశపాశమునఁబడి కాలజలదమువలేఁ బ్రకాశించుచున్న యా కేశపక్షమున మెఱపుఁ దీవియన లెఁబ్రకాశింపఁజొచ్చెను. అతని హృదయము ఝల్లు మనియెను. అతనికి నిముసమువఱకు స్మృతి లేదు. అది యుభయత్రనట్లేయుండెను. ఆమె మాటలాడు టకుఁ బ్రయత్నించెను. "కొని మాటరాలేదు. ఎట్టకేల కిట్లనియెను.

విజయసింహా! నిజముగా నన్ను స్వర్ణకుమారిమోసము చేసినది. ఆ పై తగినంత కారణము లేక యిట్లు సేయదు.దైవము కరుణారసమునుజిల్కి మిమ్మును మరణావస్థనుండి బ్రదికించినాఁడు. ఆ పె మునియా శ్రమమునకు వచ్చుట యెఱుఁగుదునుగాని, యీసంగతి దెలిసిన --- ' ఆ పెదృష్టికి మరల నవరోధము గల్గినది. మఱి యామె మాట్లాడ లేకపోయెను.విజయ సింహుండంతయుఁ జూచెను.

విజయ : జగన్మోహినీ ! చెప్పకుండుటే మేలయినది. అప్పుడు నీకు దెలిసిన మనభవిష్యతిట్లుండి యుండదు.

ఆపై మతిమాటాడ లేదు.

అతఁడిట్లనియెను.