పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

విజయనగర సామ్రాజ్యము


కేమేని యుపమానము లీ సౌభాగ్యమయ ప్రపంచముననున్న “వేమో దయచేసి చెప్పుము.

ఆమె యెవరు ? ఆమె నిజముగా జగన్మోహిని- త్రిజగ న్మోహిని-సకలజగన్మోహిని. ఆమె పేరును జగన్మోహిని. ఆమె శృంగార పురాధీశ్వరుని తనయ. లోకోత్తర సుగుణ సౌందర్య రాశియగు విజయసింహునికిఁ జిన్న నాఁటి స్నేహితురాలు. సహాధ్యాయిని.

ఆపే యట్టు లా మాధవీమంటపమధ్యమునఁగల యొక రాతి ఫై (గూర్చుండియేదియో చింతించుచుండెను.ఆమె మొగ మాక సమువంకఁ జూచుచుండెను. కాని యా పై యాసమీప మునఁగల రసాలము నధిష్టించి పాడుచున్న కోకిల గీతము నాల కించుచుండ లేదు. ఆలోచించుచును, ఉండ లేదు.

ఆ పె యీల తామంటపము నాలోకించి యిట్లనుకొని యెను. “ఈమాధవిని మంటపమునకుఁ బ్రాకిడినది విజయ సింహుఁడు. ఇతఁడీమాధవీలతకు దినదినము మిక్కిలి శ్రద్ధతో 'నీరు తెచ్చి పోసి పెంచినాఁడు. ఈలతయందతని కెంత యోప్రీతి.”

బాల్యమునందుఁ బిల్లలు సేయు సహవాసములు నిష్క ల్మషములు. నిర్మలములు. వారికి ద్వేషము లుండవు. వారి కత్యంత మగు ప్రేమానుబంధము కుదురును. ఇది జీవి తాంతము వఱకు మఱపు రాదు. ఆ పె మరల నిట్లనుకొనియెను.