పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

విజయనగర సామ్రాజ్యము


యైయుండును. జాగ్రదవస్థలో నెప్పుడేని మీకుఁ గలలు వచ్చినవియా! తుద కతనికి విసుగువచ్చెను. తోడనే తెల్ల దామర రేకులవలెఁ బ్రకాశించుచున్న కన్నులు మోడ్చెను. పూర్వోక్తమగు నపూర్వమనోహర విగ్రహము మరల వచ్చి యతని యెదుట నిలువఁబడియెను. ఆప్రదేశ మెల్ల నిశ్శబ్ద ముగా నుండెను. ఆ పె యుచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా విడచుచుండెను. విజయసింహుని యుధ రాగ్ర భాగమునుండి యేవియో కొన్ని మాటలు వెల్వడెను. అతఁడు కన్నులు విప్పి చూచుచున్నాడా? లేదు. అది నిశ్చయముగాఁ గలవరింత. కాని యాచిత్ర ప్రతిమవంకఁజూడుఁడు.—ఆ మొగమున నూతన మందహాసము పొడసూపెను. ఆపై యానంద యయ్యెను. కాని, యచట నామే నిలువ లేదు. ఆగది గోడ లలో దొంగ ద్వారములుండును. లెస్సగాఁ బరిశోధించినఁగాని యవికన్పడవు. అతఁడు కలవరించుచు లేచి చూచెను. . ఏమియు లేదు.