పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

45



చూచినాఁడా ? కలగాదుకదా! కలయేయైయుండును. " లేని యెడల చట్టి యరణ్యమునఁగల యాయుటజమున, ఆ మునులి మధ్య, నట్టిసంపూర్ణ శరదిందుముఖ యేల యుండును ? అతని మొగమువంకఁ జూడుఁడు. అది మాఱుచున్నట్లున్నది. అతఁడు కలకాదని తలఁచెనేమో ! ఆగది నెల్ల మరల మరలఁ జూచెను. ఏమియుఁ గన్పడ లేదు. కాని యతని హృదయమున నారా టము హెచ్చెను. ఇట్లనుకొనెను

“ ఏమి ! యీ విచిత్రము ! ఈ పె స్వర్ణ కుమారి కాదా ? ఈ యర్థ రాత్రికడ, భయంకరమయిన యరణ్యమును దాటి యిచ్చటికెట్లు వచ్చినది ! ఆమె కెనరు సాయము చేసి యుందురు?నేను నిజముగా, ఆమెను జూచితినా ! కలయే మాం ! అబ్బా !మనమున కేమియుఁ దోఁచుట లేదు. ”

నిశ్చయముగా నాతని కేమియుఁ దోఁచుచుండుట లేదు. పగలాయాశ్రమమున నాపె నెప్పుడు సత్యడు సూచియుండ లేదు. . అతఁడిప్పటికి నచ్చి రమారమి యిరునది దిసములు దాటినది. “హా! జగన్మోహినీ! హా ! జగన్మోహినీ !' యని యప్పటి నుండి యతఁడు పలుసార్లు నిట్టూర్పు గూడ నుచ్చ రించుచు నుం డెమ..ఆ దినము గడచినది మఱల రాత్రిఆ చిత్రమేమో చూతమని యీనాఁడు రాత్రి యాయెను. చాలవఱ 'కాతఁడు నిద్రింప లేదు. ఎంత వఱకు నిద్రనొంద లేదో అంతవఱకు నేజూడయును లేదు. అది నిశ్చయముగాఁ గలయే



.