పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

విజయనగర సామ్రాజ్యము

.


లోనఁజాగులుచుండెను. కాని యతిధీరుఁడగుటచేతఁ బయికి గిన్పడనీయ లేదు. తెల్ల వారునంతకును, అతని శిష్యులు నతఁడు నతనింగని పెట్టుకొని కూర్చుండిరి. అతఁడు మాటలాడ లేదు.జ్వర మువడి తగ్గ లేదు. భగ్గున దేహమెల్ల మండుచుండెను. ఆవడిలో నప్పుడప్పుడు కలవరించుచుండెను. కాని యతని కేమియుఁ దెలియదు ఉదయము గడచినది. మధ్యాహ్నము గడచినది. ఈలోగా నొకసారి క్రిందఁ బెట్టిరి. కొంచెము కొనయూపిరి యింక ను గలదు. సాయంత్రము గడచినది. అప్పటికిఁ గొంచెము కనులు విప్పి చూచెను. కాని మాటలాడ లేదు. దాహమని కాఁబోలు సైగ సేసెను. తోడనే దాహ మొసంగిరి. అతఁడు మరల యథా ప్రకారముగాఁ బండుకొనెనుగాని యప్పుడప్పుడిచ్చు మందును, ధారకమునుగూడ, లోపలకుఁబోవుచుండెను. మేరునాఁడు ప్రాతః కాలమాయెను. అప్పటి కతనికి జ్వరము కొంచెము తగ్గెను. అతఁడు కండ్లు తెఱచి చూచునప్పటికి యెట్ట యెదుట .శ్రీధరుఁడుండెను. అతని కేమియుఁ దోఁచ లేదు. మొగమె త్తి నలుగడలు వీక్షించెను. అతఁడిట్లనియెను 'అయ్యా ! నేనిచటి కెప్పు డెట్లు నచ్చితిని?' శ్రీధరుని మొగమున జిరు నగవుతో చెను. స్వాభావిక సాత్వికమగునతని మొగమున సంతోషతరంగ ములు పొర్లుచుండెనుగాని యవియన్నియు విజయసింహుని , లోచన యుగ్మమును నిండింపలేదు. అట్లని యతఁడు బొత్తుగా నెఱుఁగక పోలేదు. ప్రేమానుబంధము చెడ్డది. అది దాఁగదు.