పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణ ము

ఏమియు లేదు


రమారమి రాత్రి పదునొకండు గంటలై నది. శ్రీధరుఁడు స్మృతితప్పి ప్రపంచ మెఱుఁగక పడియున్న విజయ సింహుని వెంటఁగొని యాయుటజముం జేరి తలుపుఁ దట్టెను. లోనుండి యొక శిష్యుఁడు కన్నులు నులుముకొనుచు వచ్చి తలుపుతీసెను. రాత్రియుంచిన దీపముపోయినది. తకుణమే దీపము వెల్గించిరి. విజయసింహుని దీసికొనిపోయి యొక పఱుపు పైసఁలోపలఁ బరుండఁ బెట్టిరి. అతని కింకను స్మృతి వచ్చినది కాదు. శ్రీధరుఁడు బరీక్ష్మించెను. అది మిక్కిలి నీరనస్థితిలో నుండెను. సరిగా నాడుట లేదు. అతఁడు తత్తణమే వలసిన వస్తువులం దెప్పించి యాగాయముల నెల్ల శుభపటచి కట్టుట కట్టెను. అతఁడు కనులు దెఱవ లేదు గాని, ఒక సారియిటునటు కదలెను. అతనికిపు డేమియుఁ దెలియదు. ఇంతలో నతనికి జ్వరము ప్రా రంభించెను. అధి యింకను హెచ్చాయెను. తుదకు మంటలు మండఁజొచ్చెను.

పాపము ! శ్రీధరునిగుండెలు నీరుగాఁజొచ్చెను. అతనికి విజయసింహునందుఁ గల ప్రేమ యపారము. అతనింజూచి లో