పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

విజయనగర సామ్రాజ్యము


నుండి రక్తము చిమ్మటగొట్టములనుండి వోలె బయటకిఁజిమ్ము కొని పోవుచుండెను. అతని స్వరముక్షీణించెను. అతనికి మాట వచ్చుట లేదు. శ్రీధరుఁడు నాయనా విజయసింహా!' అనియెను. అతఁడు పల్క లేదు. అతనికి స్మృతి తప్పిపోయినది. శ్రీధరుఁడు తనగుఱ్ఱము మీఁదనుండి దిగివచ్చి యతనిం బట్టు కొని తానుగూడ నాగుఱ్ ఱమెక్కెను.

కడమ మువ్వురును దారి తీయఁగా నచటికి రెండు మైళ్ళు, దూరమున నున్న యొక యుటజమున కభిముఖులై వెళ్ళిరి.