పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

విజయనగర సామ్రాజ్యము

.

అదిపర్వులెత్తుచున్నది. ఇంక జాగు సేయఁదగద'ని యాభటు లెల్లరు నొకపరిగా నతని పైబడిరి. వారు వచ్చి తన పైబడుదు రని యెఱిఁగి నారి నెదురుకొన నతఁడు సంసిద్ధుఁడై యుండెను. అతఁడు పొడవై యతితీక్షణమగు ఖడ్గమును ధరించియుండెను. రెండవ చేతిలో డాలుండెను. అతని మొగము కడు నాకలిగొన్న సింగపుం గొదమ మొగము వోలె భయంకరమైయుండెను. ఇంతలోఁగ త్తి పోట్లు వచ్చి యతనిగుఱ్ఱమునకుఁ దగిలెను. అతని గుఱ్ఱము ముందుకాళ్ళెత్తి యొక్క పెట్టున నుఱికెను. అతఁడు వెంటనే గుఱ్ఱమును వెనుకకు మఱలించెను.

ఇపుడాతని వెనుక ప్రక్క సైనికులు లేరు. అబ్బా! ఏమి యాలాఘవము! ఆగుఱి ! ఆశక్తి ! ఆ నేర్పు ! తనకు దెబ్బలు తగులకుండ డాలును గిరగిర (త్రిప్పి కాపాడుకొను చుండెను. అతని దేహ మెల్ల రక్తము గ్రమ్మెను. గుఱ్ఱమును వెనుకకు నడపి సైనికులను వెనుక ప్రక్కకు రాకుండ గదుముచుండెను.

ఒకటి- రెండు-మూఁడు-నాలుగు అయిదు తలలు క్రిందఁ బడెను. అతనికి భార మధికమగుచుండెను. శత్రువులు మీఁ దికి వచ్చు చుండిరి. గ్రీష్మ కాలమధ్యాహ్నమార్తాండుని వలె నతని మొగము భాసిల్లుచుండెను. క్రోధము హెచ్చు చుండెను. ఒకఁడు పాపమెంత సేపని పోరఁగలఁడు . ఆమధుర వదనారవిందము, ఆ కుసుమసుకుమారశరీరము, ఆ. పౌరుష