పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

విజయనగర సామ్రాజ్యము


అతఁడొక యు త్తమాశ్వము నధిష్ఠించియుండెను. అతని శిరమున నమూల్యమగు నొక పట్టుపాగా చుట్టఁబడి యుండెను. అతని బాహువులు మిక్కిలి దీర్ఘములు. కనులు విశాలమైనవి. అతని మొగమున నే దేని యైంద్రజాలికశక్తి కలదా యేమి ! లేనిచోఁ జూచువారినెల్ల నట్లాకర్షించు టేమి ?

అతఁడు గుఱ్ఱమును మిక్కిలివడిగాఁగాక మందముగాఁ గాక యొక్క తీరునఁ బోనిచ్చుచుండెను. అతఁడు వెనుతిరిగి 'చూచుట లేదు. ప్రొద్దుగ్రుంకెను. అసలే యంధ కారముగా నున్న యాయడవిలో నిపుడు కన్ను బొడుచుకొన్నను కానవచ్చుట లేదు. అప్పుడప్పు డాకసమున నక్షత్రములు మాత్రము చెట్ల 'యాకుట సందులనుండి మినుకుమినుకుమని ప్రకాశించుచుండె ను. గాఢాంధకారమైనది. అతని గమ్యస్థానమిఁకఁ జాలదూరము లేదు. అతడిపుడు తనఁగుఱ్ఱమును గొంచెము తన్నెను. అది వేగ ముగాఁ బర్విడుచుండెను.

అతని వెనుక , మార్గమున గుఱ్ఱపు డెక్కల చప్పుడు విన వచ్చుచుండెను. కొందఱాశ్వికులును, కొంత కాల్బలమును వచ్చుచుండెను.

వారతనిని సమీపించిరి. మనకుఁ దిన్న గాఁ గనిఁబడుట లేదుగాని వారికడ నాయుధములు లేకపోలేదు. వారు 'పెద్ద మనుష్యులవలెఁ గన్పడరు. వారిలో నొకఁడిట్లనియెను.