పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము

33


రామ:-మఱి యతఁడు మనకడకు వచ్చునట్లు సేయుమార్గ మేది?

అదిల్: అతని నిదివటకే పిలిపించి యుంటిని.

రామ:-అతఁడిపు డిచ్చట నున్నాడా?

ఆదిల్ :-- ! ఇచటనే యున్నాఁడు.

రొమ:- రేపొకసారి యతనిని మనకొలువులోనికి రప్పింపుఁడు.

ఆదిల్:-చిత్తము.

ఆదిల్ శాహా మొగమునఁ దోఁపకపోయినను మనమున నాహ్లాదము హెచ్చుగాఁ జొచ్చెను. చేయు ప్రయత్నము ఫలో న్ముఖమైన నెవనికి ముదముగలదు ! మన తారానాధుఁడిటు విజయనగర సామ్రాజ్యపాలనమున భాగము వహిం చెను. ఆదిల్ శాహా సెలవు గైకొని మెల్ల గాఁ దన గృహమునక రిగెను. కాని రామరా జింకను నేదోయాలోచించుచునే యుండెను.