పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

విజయనగర సామ్రాజ్యము


మాత్రము మిక్కిలి చెడ్డవి. రామరాజు ఛలో క్తి గానప్పుడప్పుడు ప్రసంగమధ్యమున నిట్లనుచుంట నతఁడు వినియుండెను. ప్రపంచ యాత్ర మిక్కిలి దుర్ఘటమైనది. జనసామాన్య మునకే ప్రపంచయాత్ర సేయవలయునన్న, గొన్ని గుణములు గావలయును.అందుదూరదృష్టి మిగుల నగత్యము. అది లేనివాఁడు యాత్రసరిగాఁ జేయఁజూలఁడు. మనుజుల స్వభావము లొక తీరు గానుండవు. కొందఱు తమ ప్రాణ స్నేహితులను గూడ నమ్మరు. మఱి కొందఱు నమ్మి నట్లుండియు లోపల నమ్మరు. ఇంక కొందఱు తమహృదయములు సరళములగుటచేఁ బ్రపంచమెల్ల నట్టిదియే యని భావించి యందఱను నమ్ముదురు. సామాన్య కార్యము లలో నెట్లున్నను రాజకీయ విషయములలో నమ్మక మొక ప్పుడు పెక్కు కష్టములం దెచ్చుచుండును. రామరాజు, ఆదిల్ శాహా యెడల నిజముగాఁ బరిపూర్ణ విశ్వాస ముంచెనో లేదో మన కింతవఱకుఁ దెలియదు.

రామ:-పాపము! మఱియిపుడు తారానాధుని గతియేమైనది ? అతఁడేమయినాఁడు? ఆదిల్ శాహా కొంచెము సేపు విచారించెను. అతఁడేమి చెప్పుదునాయని యోచించెను.

ఆదిల్ :-అతఁడు దయామయుఁడగు ఢిల్లీ శ్వరుఁడు తనయాపదను దీర్పఁగలఁడని ఢిల్లీ కిఁ బ్రయాణమైపోవ నిశ్చయించు కొనెను.