పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము

31


బ్రీతి చాలఁగలదు. ధర్మ మెచటనుండునో అచట జయము గూడ నుండును.

రామ:- తారానాధుని మనకడకు వచ్చునట్లు చేసిన నేదేని లాభము మనకుఁగల్గునా ?

ఆదిల్ : చిత్తము. మీకుఁ దెలియని దేదికలదు ! లాభము చాల యుండును.

రామ: అతఁడచట మంత్రిగదా !

ఆదిల్ :- కావున నే యతనికిఁ జాల సంగతులు తెలియఁగలవు. గోల్ కొండ నవాబు మనకు విరోధిగదా ! 'అతని నెట్లేని సాధింపవలయును. అందునకితఁడు మనకుఁ జాల సాయము సేయఁగలఁడని తలఁచెదను . రామ: అతఁడు చిర కాలము తన్ను బోషించిన రాజుగుట్టును మనకుఁ జెప్పునా ?

ఆదిల్ : అతఁడుగూడ మనవలె నతనికి గర్భ శత్రువు కావున నతఁడు రహస్యములను మనకుఁ జెప్పవచ్చును.

రామ: ఏమో ! హిందువులలో నిట్టి స్వామిద్రోహు లుందురని తలఁపను. అదేమి ? ఛలోక్తియా లేక యాదిల్ శాహా తంత్రము సకలమునెఱింగెనా ఆదిల్ శాహా గుండియలలో 'గలక్కు' మనియె. అతఁడు నిర్ఘాంతపోయెను. కాని, యతని సాహసము, ధైర్యము